'నెక్ట్స్ ఏంటి?' ఈ ప్రశ్న మిమ్మల్ని చికాకు పెట్టొద్దంటే ఈ విధంగా చేయండి!
విద్యార్ధి జీవితం ఎవరికైనా ఒక మధురమైన జ్ఞాపకం. ముఖ్యంగా జీవితాన్ని డిసైడ్ చేసే కాలేజీ జీవితం అందరికీ మరింత అందమైన అనుభవంగా ఉంటుంది. అయితే డిగ్రీ పూర్తి కాగానే ప్రతీ విద్యార్ధికి ఎదురయ్యే ప్రశ్న.. నెక్ట్స్ ఏంటి? ఈ ప్రశ్న స్టూడెంట్స్ ను చికాకు పరుస్తుంది. ఉద్యోగం చేయాలా? లేక అర్హతలను మరింత పెంచుకోవాలా? అన్నదానిపై చాలా మంది తర్జన భర్జన పడుతుంటారు. ఇటువంటి సమయంలో ఈ ప్రశ్న ఎదురుకావడంతో గందరగోళానికి గురవుతూ ఉంటారు. దీనికి తోడు తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలనే సన్నిహితులు ఒత్తిడి కూడా డిగ్రీ తీసుకున్న విద్యార్ధులపై ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగం అనే ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అనేది ప్రతీ విద్యార్ధిని కాస్త గాబరా పెడుతుంది. ఈ నేపథ్యంలో డిగ్రీ తర్వాత ఎదురయ్యే నెక్స్ట్ ఏంటి? అన్న ప్రశ్నకు చెక్ పెడుతూ తెలివిగా కెరీర్ ను నిర్మించుకునే కొన్ని విషయాలను 'కెరీర్ టైమ్స్' మీకు అందిస్తోంది. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా రిలాక్స్ అవండి!
కెరీర్ ను నిర్మించుకునే విషయాలను తెలుసుకుందాం అని చెప్పి రిలాక్స్ అవండి అంటున్నారేంటి? అని సందేహ పడకండి. డిగ్రీలోని ఆ మూడు, నాలుగేళ్లు పరీక్షలు, అసైన్ మెంట్స్ , ప్రాజెక్ట్ వర్క్ లు ఇలా ఎక్కడా ఖాళీ అన్నదే లేకుండా బిజిబిజీగా గడిచిపోతుంది. ముఖ్యంగా చివరి ఏడాది పరీక్షలు మంచి మార్కులతో పాస్ కావాలన్న ఒత్తిడితో చాలా మానసిక ఆందోళనకు గురై ఉంటారు. ముందుగా ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
- ఏదైనా ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి టూర్ వెళ్లి రండి.
- మీరు ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకుంటున్న ఏదైనా సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేయండి.
- మీ స్కూల్ స్నేహితులను కలవండి.
- ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వాలంటీర్ గా పనిచేయండి.
- కొన్ని వారాలు మీకు మీరే సెలవు ప్రకటించుకోండి.
2. అప్లై..అప్లై..అప్లై..!
స్వల్ప కాలం రెస్ట్ తీసుకున్నాక వెంటనే మీరు కొత్త శక్తితో రేసులోకి వచ్చేయాలి. ఉద్యోగం చేయాలనుకుంటే మంచి సంస్థలను ఒకవేళ మరిన్న అర్హతలను పెంచుకోవాలంటే మంచి విద్యాసంస్థలను ఎంచుకోవాలి. ఎంపిక పూర్తయిన తర్వాత వాటి జాబితా తయారు చేసుకుని వాటికి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మరిన్ని అర్హతలను పెంచుకోవాలి అనుకుంటే మంచి విద్యాసంస్థను ఎంపిక చేసుకోవాలి. మీరు అర్హతలు పెంచుకుందామని నిర్ణయించుకుని మంచి విద్యా సంస్థలను ఎంచుకున్నప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- విభిన్న సమాచార సేకరణ ద్వారా మీరు ఎంచుకున్న విద్యా సంస్థలను కంపేర్ చేసుకోవాలి.
- ఆ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయో లేదో తెలుసుకొండి.
- మీరు ఎంచుకున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొండి.
- అదే విధంగా మీరు ఎంచుకున్న విద్యాసంస్థల్లో ఫీజులను సరి చూసుకొండి.
3. అనుభవాన్ని సంపాదించండి!
ఎందుకంటే ఇప్పుడు డిగ్రీలకంటే అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఎక్కువ రోజులు ఖాళీగా ఉండకుండా చిన్న ఉద్యోగమైనా మీ మనసుకు నచ్చితే వెంటనే జాయిన్ అయిపోవాలి. దీని వలన ఖర్చులకు డబ్బు సంపాదనతో పాటు సీవీలో అనుభవాన్ని చెప్పుకునేందుకు వీలు కలుగుతుంది.
- మీ సీవీలో మీ అనుభవాన్ని, మీరు సాధించిన అచీవ్ మెంట్స్ ను క్లియర్ గా ప్రస్తావించండి.
- మీకున్న ప్రతీ అర్హతను రెజ్యుమెలో రాయండి.
- ఒకవేళ మీకు ప్రత్యేకమైన స్కిల్ ఏమైనా ఉంటే దాన్ని కూడా అందులో పేర్కొనండి.
- మీరు ఏయే బాషలను అనర్గళంగా మాట్లాడగలరో దాన్ని కూడా రెజ్యుమెలో వెల్లడించండి.
- రెజ్యుమెను ప్రిపేర్ చేసుకున్నాక ఇక మీ పని మీ కంపెనీని ఎంచుకుని అప్లయ్ చేయడమే. కొన్నాళ్ల పాటు విసుగు, విరామం లేకుండా ఈ పని చేయాల్సి ఉంటుంది.
4. మీ అభిరుచిని ఫాలో అవండి!
అభిరుచి ఆధారంగా ఉద్యోగాన్ని వెతుక్కోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ అసాధ్యం అయితే కాదు. తమ మనసుకు నచ్చిన పనిచేస్తున్న వారు మంచి ఉత్పాదకతను సాధిస్తుండటం మనకు తెలిసిందే. మీకు కూడా మీకు బాగా ఇష్టమైన పనిని మీ కెరీర్ గా మార్చుకోగలరేమో ప్రయత్నించి చూడండి. పుస్తకాలు రాయడం, డ్రాయింగ్స్ వేయడం, షార్ట్ ఫిలింస్ తీయడం, యాడ్స్ రూపొందించడం, డైలాగ్స్ రాయడం వంటి వాటిని కెరీర్ గా ఎంచుకుని చాలా మంది విజయవంతమయ్యారు. మొదట్లో చిన్న కష్టాలున్నా అభిరుచికి పెద్ద పీట వేస్తూ చాలా మంది విభిన్న కెరీర్ లను ఎంచుకుంటున్నారు. మనస్సుకు నచ్చకుంటే ఎంత గొప్ప ఉద్యోగమైనా జీవితంలో అసంతృప్తి ఆవహిస్తుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com





Comments
Post a Comment