సంపూర్ణ వ్యక్తిగా ఎదగాలంటే మీకు ఈ '6 గోల్స్' ఉండాల్సిందే!

      జీవితం అనేది ఒక్కసారి మాత్రమే అందివచ్చే అరుదైన అవకాశం లాంటిది. మనకున్న సమయంలో దాన్ని పరిపూర్ణంగా అనుభవించకుంటే అది చేజారిపోతుంది. బాధ్యతలను నెరవేరుస్తూ, లక్ష్యాలను చేధిస్తూ ప్రతీ రోజను ఆస్వాదిస్తూ జీవించడమే నిజమైన జీవితం. జీవితంలో అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదీ తగ్గకుండా, ఏదీ అతి కాకుండా చూసుకుంటూ ప్రయాణం చేస్తే మీరు విజయవంతమైన వ్యక్తిగా గుర్తించబడతారు. జీవితం లక్ష్యం ఎంత ముఖ్యమో, బంధాలు అంతే ముఖ్యం. డబ్బు సంపాదన ముఖ‌్యమే కానీ మన ఆనందం, రిలేషన్స్, ఆరోగ్యం  అంత కంటే ముఖ్యం. వీటన్నింటిని సరైన విధంగా సమన్వయం చేసుకునేందుకు ప్రతీ వ్యక్తికి కొన్ని లక్ష్యాలు ఉండాలి. సంపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు మనకు ఉండాల్సిన ఆ గోల్స్ కోసం 'కెరీర్ టైమ్స్' అందిస్తున్న ప్రత్యేక కథనం. 


1. ప్రొఫెషనల్ గోల్స్ 

    ఈ ప్రపంచంలో మనం ఎంచుకున్న రంగాన్ని, మనం ఎంచుకున్న వృత్తిని చాలా మంది ఎంచుకుని ఉంటారు. అందులో కేవలం 5 శాతమో 6 శాతం మంది మాత్రమే ఆ రంగంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపును సాధించేందుకు, మీరు ఎంచుకున్న రంగంలో మీ ముద్రను చూపేందుకు ప్రయత్నించండి. లేకుంటే మీ లాంటి లక్షలాది ప్రొఫెషనల్స్ లో మీరు ఒకరిగా, గుంపులో గోవిందం గా మిగిలిపోతారు. దీని కోసం తగిన కృషి చేయాలి. కేవలం గుర్తింపు మాత్రమే ముఖ్యం కాదు మీ ఎంచుకున్న రంగంలో మీ పేరు చెపితే అందులో మీ ఉనికి ప్రత్యేకతంగా కనిపించాలి. 



2. పర్సనల్ గోల్స్

     బలమైన పునాది లేకపోతే భవనం ఎలా అయితే బలహీనపడుతుందో బలమైన బంధాలు లేకుంటే మనిషి జీవితం కూడా బలహీనమైపోతుంది. మనిషి జీవితానికి రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యం. అవి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. రిలేషన్స్ కు గౌరవం ఇచ్చి వాటిని కాపాడుకున్నప్పుడు మీకు పరిపూర్ణ వ్యక్తిగా నిలబడతారు. ఎందుకంటే మనం ఎన్ని లక్ష్యాలను సాధించినా, ఎంత సాధించినా మనతో ఆ ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు ఆత్మీయులు కావాల్సి ఉంటుంది. జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే తాను ఒంటరిగా మిగిలిపోయానే అని అనిపించినప్పుడు ఎంత సాధించినా అది వృధాగా మారుతుంది. 



3. ఫైనాన్సియల్ గోల్స్ 

     జీవితంలో డబ్బు చాలా ముఖ్యమే. కానీ డబ్బు సంపాదనే పరమావధి కాదు. ఎందుకంటే నాణ్యమైన జీవితానికి డబ్బు ఉపయోగపడుతుంది కానీ ఆనందాన్ని మాత్రం అందించదు. బాగా డబ్బు సంపాదిస్తే ఆశలు నెరవేర్చుకోవచ్చు కానీ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట కాలపరిమితులను విధించుకుని, లక్ష్యాలకు అనుగుణంగా క్వాలిటీ లైఫ్ ను గడిపేందుకు అవసరమైన డబ్బును సంపాదించేందుకు ప్రయత్నం చేయాలి. ఫైనాన్సియల్ గోల్స్ ను రీచ్ అయ్యేందుకు మరీ స్వల్ప కాలం, మరీ దీర్ఘకాలం కాకుండా మధ్యస్థంగా ఉంటే లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎందుకంటే లక్ష్యం మరీ దూరంగా ఉన్నప్పుడు అలసత్వం, నిరుత్సాహం వస్తుంది. అలా అని మరీ తక్కువ వ్యవధి ఉంటే ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. 



4. సోషల్ గోల్స్ 

      ఒకవేళ మీరు అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సోషల్ గోల్స్ ను నిర్దేశించుకోవాలి. మీరు ఎదిగేందుకు సహాయపడిన సమాజానికి తిరిగి ఏదైనా సహాయం చేసేందుకు ప్రయత్నించాలి. సేవా దృక్పధంతో పేదలకు ఉచితంగా విద్యను అందించడం, వైద్యం చేయించడం, అనాధలకు సహాయం చేయడం వంటివి చేయాలి. ఇలాంటి సమాజ సేవ చేయాలన్న ఆలోచన మీకు లక్ష్యాలను మరింత ఉన్నతంగా చేసి మీరు పరిపూర్ణ మనిషిగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 



5. హెల్త్ గోల్స్ 

      మనం ఎంత ఉన్నత స్థితికి చేరినా పెద్ద లక్ష్యాలను సాధించినా వాటిని ఆస్వాదించేందు తగిన ఆరోగ్యం లేకపోతే ఇదంతా వట్టి వృధాగా మిగులుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం అనేది మన మరో ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి. కొన్ని పరిమితులకు లోబడి వ్యాయామం, యోగా లాంటివి క్రమం తప్పకుండా చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. ఒక్క శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదుపు కోల్పోకపోవడం మీ మానసిక ఆరోగ్యానికి సూచిక. ప్రతీ విషయాన్ని సానుకూల దృష్టితో చూడటం, జీవితం పట్ల సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం కూడా మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. 


6. స్పిరిచ్యువల్ గోల్స్ 

       చాలా మంది జీవితంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. అదేమిటంటే భౌతికంగా సుఖపెట్టేవాటిని అన్నీ సమకూర్చుకుంటే ఆనందంగా ఉండొచ్చని భ్రమ పడతారు. కానీ ఇలాంటి వస్తువులు, విషయాలు మనలో అంతర్గతమైన మనస్సు సంతోషాన్ని ఇవ్వలేవు. మనిషికి శాంతినీ, సంతృప్తిని అందించేది ఆధ్యాత్మిక జీవన శైలి మాత్రమే. మతాలతో సంబంధం లేని విధంగా ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవన శైలిని అలవర్చుకుంటే శాంతి కలుగుతుంది. దీని వలన మనస్సు ప్రశాంతంగా ఉండటమే. కాదు దేనికి ప్రాధాన్యత నివ్వాలి దేనికి ఇవ్వనవసరం లేదు అన్నదానిపై స్పష్టత వస్తుంది. దీని వలను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు మార్గం సుగమమవుతుంది. 


ఈ ఫీచ‌ర్ పై  గైడెన్స్ కావాల్సిన వారు  క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరచ్చు.
97006 09135



                   You can send your Educational related articles to  careertimes.online1@gmail.com


Comments

Popular posts from this blog

అదృష్టాన్ని జేబులో పెట్టుకు తిరగడం ఎలా?

24.."టైం మిష‌న్"..!

ఈ 'కెరీర్' తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!