నెక్స్ట్ జనరేషన్ లో బాగా డిమాండ్ ఉండే జాబ్స్ ఏంటో తెలుసా?
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఆధారంగానే నడుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న , భవిష్యత్ లో జరగబోయే ఆవిష్కరణలన్నీ ఇంటర్నెట్ కేంద్రంగానే జరగబోతున్నాయి. ఆన్‌లైన్ బేస్డ్ గా జరుగుతున్న ఈ టెక్నాలజీ విసృతికి అనుగుణంగానే కంపెనీలు తమ రూపును మార్చుకుంటున్నాయి. అంతెందుకు టెక్నాలజీ ఉన్న ఫళంగా కొన్ని గంటలు నిలిచిపోతే చాలు, దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలుతాయి. దీంతో ఈ డిజిటల్ వరల్డ్ లో కొత్త జాబ్స్ ఊపిరిపోసుకుంటున్నాయి. ఇందులో కొన్ని జాబ్స్ గూర్చి గతంలో చర్చించుకున్నప్పటికీ ఈ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ కు వచ్చే ఐదేళ్లలో మంచి డిమాండ్ ఉంటుంది. ఆన్‌లైన్ లోనే కంపెనీని ఉన్నత శిఖరాలకు చేరుస్తూ, ఆన్‌లైన్ లోనే సవాళ్లను పరిష్కరించే ఈ సూపర్ జాబ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా?
ప్రస్తుతం సోషల్ మీడియా పరిధి పెరిగాక సాంప్రదాయ మార్కెటింగ్ మెల్లగా కనుమరుగవుతోంది. ఇప్పుడు అధిక శాతం మార్కెటింగ్ సోషల్ మీడియాలో జరిగిపోతోంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ప్రభావితం చేయగల వ్యక్తులు కొందరు ఉంటారు. ఇటువంటి వ్యక్తులను గుర్తించడమే ఇన్‌ఫ్లూయెన్సియల్ మార్కెటర్స్ పని. ఫేస్‌బుక్, బ్లాగ్స్ , లింక్డ్ఇన్ వంటి సైట్లలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారిని వీరు ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత తమ బ్రాండ్ ను ఇటువంటి వ్యక్తుల ద్వారా ఆన్‌లైన్ సైట్లలో ప్రచారం చేస్తారు. వీరిని దీనికి ఒప్పించడం వారి సేవలను వినియోగించుకోవడం అన్నది ఇన్‌ఫ్లూయెన్సియల్ మార్కెటర్స్ ముఖ్యమైన పని. మార్కెటింగ్ లో , అలాగే కమ్యూనికేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు ఈ జాబ్ ను ఎంచుకుంటే విజయవంతమవుతారు.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. మొబైల్, ల్యాప్‌టాప్ ఇలా మెయిన్ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అన్నీ బ్యాటరీ ఆధారంగానే పనిచేస్తున్నాయి. దీంతో ఈ బ్యాటరీల జీవితకాలాన్ని, పని సామర్ధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లేదా 3డీ డిజైన్ సర్క్యూట్ బోర్డ్స్ భారీగా అవసరమవుతున్నాయి. దీంతో కంపెనీలకు వీటిని రూపొందించే నిపుణుల అవసరం పెరిగిపోయింది. సర్క్యూట్స్ బోర్డులు, చిప్స్ , సెన్సార్ ఉన్న మల్టీ పర్పస్ సర్క్యూట్ బోర్డును అభివృద్ధి చేసే వారికి డిమాండ్ బాగా ఉంది.
ఇంటర్నెట్ విసృతి పెరిగిపోవడంతో ఇప్పుడు అంతా ఆన్‌లైన్ లోనే జరిగిపోతోంది. పేపర్ చదివే తీరిక లేకపోవడంతో చాలా మంది మొబైల్, ల్యాప్‌టాప్ లలోనే వార్తలు,ఇతర విషయాలను చదువుతున్నారు. దీంతో వెబ్‌సైట్లకు, కమ్యూనికేషన్ సైట్లకు ఆదరణ పెరుగుతోంది. ఒక వెబ్‌సైట్ , బ్లాగ్, లేదా కమ్యూనిటీలో కంటెంట్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దేది డిజిటల్ ప్రొడక్షన్ మేనేజర్. ఆయా సైట్లలో ఉపయోగించిన ఫోటోలు, ఆడియోలు, వీడియోలు, టెక్స్ట్ ఇలా మల్టీమీడియా విషయాలన్నీ ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తన దగ్గరున్న కంటెంట్ ను ఆకర్షణీయంగా, ఆల్‌లైన్ లో ఎలా ప్రజంట్ చేయాలో బాగా తెలిసుంటే డిజిటల్ ప్రొడక్షన్ మేనేజర్ గా రాణించొచ్చు. వీటికోసం ఉపయోగించే సాఫ్ట్ వేర్ టూల్స్ పై అవగాహన ఉంటే మరింతగా ఈ ఉద్యోగంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు న్యూస్ పేపర్ చదివే టైం ఉంటటం లేదు. అది చదివే అలవాటు కూడా క్రమంగా తగ్గిపోతోంది. అందరూ ఆన్‌లైన్ లోనే వార్తలు చదువుతున్నారు. అక్కడ కూడా సుదీర్ఘంగా గతంలోలా ఉంటే చదవడం లేదు క్లుప్తంగా చదివేందుకు కొత్త పద్ధతుల్లో ఉంటేనే చదువుతున్నారు. ఇలా చదవేవాళ్లకు ఆకర్షణీయంగా విషయాన్ని ప్రజెంట్ చేసేవాళ్లను డిజిటల్ స్టోరీ టెల్లర్స్ అంటున్నారు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా కంటెంట్ ను చాలా ఆకర్షణీయంగా, ఆడియో, వీడియోలు చూపిస్తూ ఎట్రాక్ట్ గా చెప్పగలగడమే వీరికి కావాల్సిన ప్రధాన అర్హత. ప్రస్తుతం మార్కెట్లో వీరి చాలా డిమాండ్ ఉంది.
5. ఎథికల్ హ్యాకర్స్
టెక్నాలజీ జీవితాన్ని ఎంత సులభతరం చేస్తుందో అలాగే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అంతే జఠిలం చేస్తుంది. కంపెనీలు కేవలం టెక్నాలజీ ఆధారంగానే పనిచేయడం మొదలుపెట్టాక వాటిని బ్రేక్ చేసే హ్యాకర్స్ పుట్టుకొచ్చారు. దీంతో ఆన్‌లైన్ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం ఎథికల్ హ్యాకర్స్ కు డిమాండ్ పెరిగింది. ఎథికల్ హ్యాకర్ లీగల్ గానే కంపెనీల వెబ్‌సైట్స్ ను హ్యాక్ చేస్తూ ఉంటారు. కంపెనీలు డబ్బులిచ్చి మరీ హ్యాక్ చేయమని చెప్తాయి. దీని వలన తమ సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాలు తెలుసుకుంటాయి. తర్వాత వాటిని సరిదిద్దుకుంటాయి. ఆన్‌లైన్ పరిధి ఇంతలా పెరిగిపోయాక ఎథికల్ హ్యాకర్స్ కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135






Comments
Post a Comment