మన దేశంలో భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు ఏంటో తెలుసా?
మనం ధనవంతులం అయ్యేందుకు, బాగా డబ్బు సంపాదించేందుకు దగ్గరి దారులు అంటూ ఏమీ ఉండవు. బాగా కష్టపడి పనిచేయడం ద్వారానే ఎవరైనా ధనవంతులు కాగలుగుతారు. వక్రమార్గంలో కాకుండా న్యాయమైన పద్ధతిలో సంపాదించే డబ్బుకే ఎప్పుడూ విలువ, స్థిరత్వం ఉంటాయి. వ్యాపారంలో విజయవంతమైతే మిలీయనీర్ కావడం ఏమంత కష్టం కానేకాదు. వ్యాపారాన్ని మినహాయిస్తే కొన్ని ఉద్యోగాలు ప్రస్తుతం ఉద్యోగులకు కాసులు కురిపిస్తున్నాయి. మన దేశంలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంది. ఇందులో పనిచేసే వారు సీనియర్ లెవెల్లో తీసుకునే వేతనం ఔరా అనిపించేలా ఉంటుంది. నైపుణ్యంలో టాప్ క్లాస్ గా ఉంటేనే టాప్ క్లాస్ వేతనం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్న ఉద్యోగాలేంటో తెలుసుకుందామా?
1. మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్
ఒక సంస్థకు మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్ వెన్నుముక లాంటి వాళ్లు. కంపెనీ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే సమర్ధులైన మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్ కావాల్సిందే. అందుకే ఎంట్రీ లెవెల్ లో కెరీర్ లో స్థిరపడేందుకు ఈ రంగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒకసారి కెరీర్ కీలక పాయింట్ ను క్రాస్ చేసారంటే వీళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. ఉన్నత స్థానాల్లో వీరు డిమాండ్ చేసినంత వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. కెరీర్ అనుభవం పెరిగాక వీళ్లకున్న డిమాండ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి.
ఎంట్రీ లెవెల్ : రూ. 3లక్షలు
మిడ్ లెవెల్ : రూ. 25 లక్షలు
సీనియర్ లెవెల్ : రూ. 80 లక్షలు
2. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్స్
ఒక కంపెనీ ఆర్ధికంగా బలంగా ఉండాలంటే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ దే కీలక పాత్ర. కంపెనీ మూల ధనం సమకూర్చడంతో పాటు కంపెనీకి అవసరమైన ఆర్థిక సలహాలను కూడా అందిస్తాడు. మనీ మేన్ గా పిలుచుకునే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ కంపెనీకి ఒక రకంగా ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఇంతటి కీలకం కాబట్టే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ను కంపెనీలు జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ వ్యూహాలను అనుసరించే ఒక కంపెనీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుతాయి.
ఎంట్రీ లెవెల్ : రూ. 12 లక్షలు
మిడ్ లెవెల్ : రూ. 30 లక్షలు
సీనియర్ లెవెల్ : రూ. 50 లక్షలు
3. చార్టెర్డ్ అకౌంటెంట్
ఒక కంపెనీకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, లాభ నష్టాల లెక్కలు అన్నీ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కంపెనీకి మూల స్తంభాల్లాంటి కీలక ప్రోఫెషనల్స్ లో ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఒకరు. ఇది చాలా బాధ్యతాయుతంగా చేయవలసిన ఉద్యోగం. ఏ మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కంపెనీ తలరాత మారిపోతుంది. కోర్సు కఠినం కావడంతో భారీ డిమాండ్ ఉన్నా ప్రతీ ఏడాది పరిమిత సంఖ్యలోనే ఛార్టెర్డ్ అకౌంటెంట్ లు మార్కెట్ లోకి వస్తారు.
ఎంట్రీ లెవెల్ : రూ.5.50 లక్షలు
మిడ్ లెవెల్ : రూ. 12.80 లక్షలు
సీనియర్ లెవెల్ : రూ. 26 లక్షలు
4. ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నిపుణులు
బాగా లాభాలు వచ్చే రంగాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగానిదే అగ్రస్థానం. అందుకు అనుగుణంగానే ఈ రంగంలో పనిచేసే నిపుణులు మంచి వేతనాలు ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చినా వేతనంకు తోడు భారీ అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో చాలా ఉద్యోగాలు ఉన్నా జియాలజిస్ట్, మెరీన్ ఇంజినీర్లకు బాగా డిమాండ్ ఉంది.
ఈ రంగంలో అనుభవజ్ఞులకు ఏడాదికి రూ.20 లక్షల వరకూ వేతనం ఉంటుంది.
5. బిజినెస్ అనలిస్ట్
కంపెనీల మధ్య పోటీ పెరగడంతో మన దేశంలో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పోటీ సంస్థకు ధీటుగా ఎదిగేందుకు కావాల్సిన వ్యూహాలు సిద్ధం చేయడంలో బిజినెస్ అనలిస్ట్ లదే కీలకపాత్ర. అందుకే కంపెనీలు మంచి ఐక్యూ, లాజికల్ నాలెడ్జ్ ఉన్న బిజినెస్ అనలిస్ట్ లను మంచి వేతనాలు ఇచ్చి నియమించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. మ్యాథమేటికల్ పరిజ్ఞానంతో పాటు ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీలను నేర్చుకుంటే ఈ రంగంలో ఉన్న వారికి అధిక వేతనాలకు కొదువ లేదు.
ఎంట్రీ లెవెల్ లో రూ. 6 లక్షల వేతనం వచ్చే ఈ రంగంలో అనుభవం గడిస్తే ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ సంపాదించవచ్చు.
6. మెడికల్ ప్రొఫెషనల్స్
ఏ రంగంలో అయినా సంక్షోభం వస్తుంది కానీ వైద్య రంగంలో మాత్రం సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదు. సేవా దృక్ఫదంతో పాటు కాస్త అభిరుచి ఉంటే ఈ రంగంలో ఎదుగుదలకు ఢోకా ఉండదు. ఇక అనుభవంతో పాటు పేరు ప్రఖ్యాతులు వస్తే వైద్య రంగంలో వారిని ఆపడం ఎవరి తరమూ కాదు.
జనరల్ ప్రాక్టీస్ : రూ. 5 లక్షలు
జనరల్ సర్జన్ : రూ. 8.50 లక్షలు
మెడికల్ డాక్టర్ : రూ. 18 లక్షలు
7. ఏవియేషన్ ప్రొఫెషనల్స్
విమానయాన రంగంలో ఉన్నవారి ఎదుగుదలకు ఆకాశమే హద్దు. కాస్త సహనం, మరికాస్త నేర్పు ఉంటే ఏవియేషన్ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. జీతాలు భారీగా ఉండటంతో ఇటీవలి కాలంలో ఈ రంగాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రయాణికుల సర్వీస్ లతో పాటు సరుకు రవాణా రంగం కూడా పుంజుకోవడంతో నిపుణులకు డిమాండ్ పెరిగింది.
కమర్షియల్ పైలెట్ : రూ. 20 లక్షలు
హెలికాప్టర్ పైలెట్ : రూ. 18 లక్షలు
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ : రూ. 10 లక్షలు
8. లా ప్రొఫెషనల్స్
మన దేశంలో లాయర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. డాక్టర్స్ లానే ఒక్కసారి పేరు ప్రఖ్యాతులు వస్తే వీరి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మనం పేరున్న లాయర్ల తీసుకునే ఫీజు పెద్ద జడ్జీల వార్షిక జీతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే లక్షణం, సహనం, మంచి భావవ్యక్తీకరణ ఉంటే లాయర్ గా రాణించొచ్చు. పెద్ద లాయర్స్ ఒక్క ఆర్గ్యుమెంట్ కే భారీ ఫీజును డిమాండ్ చేస్తారు.
సగటు వేతనం
కార్పోరేట్ లాయర్ : రూ. 6.50 లక్షలు
సీనియర్ అటార్నీ : రూ. 9.80 లక్షలు
9. మార్కెటింగ్
మార్కెటింగ్ అనేది ఒక కళ. ఈ కళలో నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. కానీ ప్రారంభ దశలో మాత్రం కెరీర్ చాలా క్లిష్టంగా ఉంటుంది. వేతనం పాటు స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే కెరీర్ ను నమ్ముకుని శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మార్కెటింగ్ లో కెరీర్ ను ప్రారంభించి కంపెనీలకు సీఈఓ లు అయినవారు కూడా ఉన్నారు.
ఎంట్రీ లెవెల్ : రూ. 1.50 లక్షలు
మిడ్ లెవెల్ : రూ. 5.50 లక్షలు
సీనియర్ లెవెల్ : రూ. 10.50 లక్షలు
10. ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్
భారీగా వేతనాలిచ్చే ఉద్యోగాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ ప్రొఫెషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ లాంగ్వేజ్ లు తెలిసిన వారు ఇందులో బాగా రాణించవచ్చు. సాఫ్ట్ వేర్ లను రూపొందించడం మొదలుకుని టెస్టింగ్, డిజైనింగ్ వంటి ఎన్నో విభాగాలు ఐటీ రంగంలో ఉన్నాయి.
ఎంట్రీ లెవెల్ : రూ. 3.50 లక్షలు
మిడ్ లెవెల్ : రూ. 8.50 లక్షలు
సీనియర్ లెవెల్ : రూ. 15.80 లక్షలు
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135










Comments
Post a Comment