మీ కెరీర్ ను 'మేఘాలను' తాకించండి!

      రోజురోజుకీ విస్తరిస్తున్న టెక్నాలజీ కొత్త అవకాశాలకు దారులు పరుస్తోంది.  టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మలుచుకుంటూ  కొత్త విషయాలను నేర్చుకునేందుకు రెడీ ఉన్న విద్యార్ధులకు అవకాశాలకు కొదువే లేదు. ప్రస్తుతం ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది హాట్ కెరీర్ గా నిలుస్తోంది. కంపెనీలన్నీ ఈ కొత్త విధానానికి మారుతుండటంతో క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల అవసరం పెరిగింది. మనం రోజువారీ వాడే మొబైల్ బ్యాంకింగ్, ఫేస్ బుక్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారానే జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టెక్నాలజీ మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూనే తిరుగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో మన దేశంలో కనీసం 3 లక్షల మంది క్లౌడ్ నిపుణుల అవసరమవుతారని సర్వేలు చెపుతున్నాయి.  మంచి వేతనాలకు, చక్కటి కెరీర్ కు కేరాఫ్ గా నిలుస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కోసం మరింత తెలుసుకుందాం రండి. 



సర్వం క్లౌడ్ కంప్యూటింగ్ మయం!

        గతంలో పర్సనల్ కంప్యూటర్స్ లో ఇన్‌స్టాల్ అయిన ఉన్న అప్లికేషన్లను మాత్రమే వాడుకునే అవకాశం ఉండేది. తర్వాత లోకల్ సర్వర్ లో లోడ్ చేసి దానికి అనుసంధానం చేసిన కంప్యూటర్స్ లో అప్లికేషన్లను వాడేవారు. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతోనే మొత్తం కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అంతా ఆన్ లైన్ లోనే సాగిపోతోంది. డేటాను ప్రాసెస్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడం, అప్లికేషన్లను నడిపించడం వంటివన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. అదే విధంగా సొంతంగా సర్వర్లను నిర్వహించలేని చిన్న కంపెనీలకు క్లౌడ్ కంప్యూటింగ్ వరంలా మారింది. ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్లను నడిపిస్తూ, డేటానే భద్రపర్చుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో సర్వర్ల విధానానికి స్వస్తి చెప్పి అన్ని కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ బాట పడుతున్నాయి. దీంతో మంచి వేతనాలు ఇచ్చి నిపుణులను నియమించుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 



నైపుణ్యంతో అవకాశాన్ని ఒడిసిపట్టొచ్చు

         క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరిస్తున్న వేగానికి తగ్గట్టు ఈ రంగంలో నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ డిమాండ్ ఇదే విధంగా కొనసాగే పరిస్థిుతులు ఉన్నాయి. డేటా స్ట్రక్చర్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విభిన్న హోదాలతో ఈ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలీ మెడిసిన్, ఈ కామర్స్ వంటి రంగాల్లో క్లౌడ్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న వారి కెరీర్ కు ఎటువంటి ఢోకా ఉండదని నిపుణులు చెపుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న అభ్యర్ధులకు ప్రత్యేకమైన అర్హతలతో పనిలేదు. ప్రత్యేకించి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే రాణించవచ్చని నియమం ఏమీ లేదు. డాట్ నెట్, జావా, టెస్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్లు  ఇందులో రాణించవచ్చు. అయితే ప్రారంభంలో కొన్ని నైపుణ‌్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. విజువలైజేషన్ టెక్నాలజీ, రన్నింగ్ సర్వర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పై పట్టు ఉండాలి. అదే విధంగా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్,  సెక్యూరిటీ ప్రోటోకాల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్ధుల కోసం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. 



సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ తో సక్సెస్!

క్లౌడ్ కంప్యూటింగ్ లో అవకాశాలు విసృతమవుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో సర్టిఫికేట్ ప్రోగ్రాముల సంఖ్య కూడా పెరుగుతోంది. నైపుణ్యాలతో పాటు సర్టిఫికేషన్ కూడా ఉంటూ అదనపు అర్హతగా పరిగణించి కంపెనీలు అటువంటి అభ్యర్ధులు ప్రాధాన్యతనిస్తున్నాయి. 
క్లౌడ్ కంప్యూటింగ్ లో ప్రస్తుతం ఉన్న కొన్ని స‌ర్టిఫికేష‌న్ల‌ను  గమనిస్తే..
  • గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం క్లౌడ్ అకాడమీ
  • ఐబీఎం సర్టిఫైడ్ సోల్యూషన్ అడ్వైజర్ - క్లౌడ్ 
  • ఐబీఎం సర్టిఫైడ్ సోల్యూషన్ అర్కిటెక్ట్ - క్లౌడ్ 
  • కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 
  • విఎంవేర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (వీసీపీ) 
  • మైక్రోసాఫ్ట్ అజ్యురె సర్టిఫికేషన్స్ 
  • సర్టిఫైడ్ క్లౌడ్ ప్రొఫెషనల్ (సీసీపీ) 


కుదురుకుంటే తిరుగులేదు!

       క్లౌడ్ కంప్యూటింగ్ లో నైపుణ్యాలు ఉండాలే కానీ తక్కువ సమయంలో ఉన్నత స్థానానికి వెళ్లేందుకు అవకాశాలున్నాయి. ఇక వేతనాలు కూడా మిగతా వారితో పోల్చుకుంటే అధికంగానే ఉన్నాయి. అర్కిటెక్చర్ స్కిల్స్ తో పాటు క్లౌడ్ నైపుణ్యాలు ఉన్నవారు క్లౌడ్ సోల్యూషన్ ఆర్కిటెక్ట్ గా కెరీర్ లో స్థిరపడొచ్చు. ఇక కనీస అవగాహనతో ఐటీ అడ్మినిస్ట్రేషన్ లో చేరవచ్చు. మంచి అనుభవం, నైపుణ్యాలను సంపాదిస్తే సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ డెవలపర్లుగా వెబ్ సర్వీసెస్ సిస్టమ్ ఇంజినీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజీనీర్, ప్రోగామర్ గా ఉద్యోగాలను సాధించేందుకు వీలుంది. డిమాండ్ అధికంగా ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలు మంచి నైపుణ్యం ఉండాలే కానీ భారీ జీతాలతో క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రారంభ స్థాయిలోనే కొన్ని కంపెనీలు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇక మంచి అనుభవం ఉండే ఏడాదికి రూ.25 లక్షల వరకూ వేతనాలున్నాయి. భవిష్యత్ లో ఐటీ రంగంలో రాణించాలనుకుంటున్న విద్యార్ధులు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పై కూడా ఓ కన్నేయండి.




ఈ ఫీచ‌ర్ పై  గైడెన్స్ కావాల్సిన వారు  క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరచ్చు.
97006 09135




                    You can send your Educational related articles to  careertimes.online1@gmail.com


Comments

Popular posts from this blog

అదృష్టాన్ని జేబులో పెట్టుకు తిరగడం ఎలా?

24.."టైం మిష‌న్"..!

ఈ 'కెరీర్' తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!