ప్రపంచంలో టాప్ 5 చెత్త ఉద్యోగాలు ఏంటో తెలుసా?
ఉద్యోగం అనగానే మంచి జీతం, స్థాయి, ఆఫీస్ లో సౌకర్యాలు, పదోన్నతులు ఇలా సాగుతాయి మన ఆలోచనలు. అయితే ఇలాంటి సదుపాయాలు, సౌకర్యాలతో అందరికీ ఉద్యోగాలు దొరక్క పోవచ్చు. దీంతో దొరికిన పనినే ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే కొన్ని ఉద్యోగాలు చాలా ఫన్నీగా మరికొన్ని అసహ‌్యకరంగా, భయంకరంగా ఉంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా చెత్త ఉద్యోగాలే ఉన్నాయి. తిని కూర్చుంటే మనిషి పుట్టుకకు అర్ధం ఉండదు కాబట్టి చాలా మంది ఈ చెత్త ఉద్యోగాలను కూడా ఇష్టంగా చేస్తున్నారు. అలాంటి ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాల కోసం మనం తెలుసుకుందాం. పేరుకి ఇవి వరస్ట్ జాబ్స్ కావచ్చు కానీ వేతనాల్లో మాత్రం సాఫ్ట్ వేర్ ప్రోపెషనల్స్ కు వీరు ఏ మాత్రం తీసిపోరు. అన్నింటికంటే ముఖ్యంగా పనిపై వీరి కుండే శ్రద్ధాసక్తులకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
మీరెప్పుడైనా బాడీ ఆడర్ ను వాడినప్పుడు అరె ఈ వాసన చాలా బాగుందే అనిపించిందా? అయితే మీరు బాడీ ఆడర్ టెస్టింగ్ ఏజెంట్ కు థాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే అతనే ముందుగా దాన్ని వాసన చూసి రకరకాలుగా పరీక్షించి మీ దాకా వచ్చేలా చేసాడు. ఈ బాడీ ఆడర్ స్నిప్పర్స్ దాదాపు 50 మంది విభిన్న శరీర తత్వాలున్న మనుష్యులపై తమ కంపెనీ బాడీ ఆడర్ ను ప్రయోగించి అది ఎన్ని గంటలు పనిచేస్తుందో వాసన చూసి తెలుసుకుంటారు. ఈ క్రమంలో అతి సమీపం నుంచి ఆయా మనుష్యులను శరీరాలను వాసన చూడాల్సి వస్తుంది. వీరు ఇలా ఆడర్ ను ప్రయోగించి వాసన చూసి రిపోర్ట్ ఇచ్చాకే కంపెనీ మార్కెట్లోకి తమ బాడీ ఆడర్ ను రిలీజ్ చేస్తుంది. చూడడానికి, వినడానికి ఇది పరత చెత్త జాబ్ లా అనిపిస్తున్నా , ఇందులో జీతం మాత్రం చెత్త కాదు. ఈ బాడీ ఆడర్ స్నిప్పర్ జీతం నెలకు రూ. 4 లక్షల నుండి 8 లక్షల వరకూ ఉంటుంది.
2. న‌్యూడ్ మోడల్
వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ ఉద్యోగం విదేశాల్లో చాలా హాట్ కెరీర్. కొందరు ఆర్టిస్టుల ముందు వారు బొమ్మ గీసేందుకు అనువుగా ఈ న్యూడ్ మోడల్స్ నగ్నంగా నిలబడాల్సి ఉంటుంది. హావభావాలు, శారీరక కదలికలు మార్చకుండా గంటల తరబడి అలా నగ్నంగా కూర్చోవడమే న్యూడ్ మోడల్స్ పని. ఈ న్యూడ్ మోడలింగ్ అనేది పురాతన కాలం నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతూ వస్తోంది. ప్రాచీన గ్రీకు నాగరికతలో ఇలా న్యూడ్ మోడల్స్ ను పెట్టి అప్పట్లో మంచి మంచి కళాఖండాలను సృష్టించారు. ఇప్పుడు కూడా చాలా మంది ఆర్టిస్టులు న్యూడ్ మోడల్స్ తో బొమ్మలు గీస్తున్నారు. న్యూడ్ మోడల్స్ కు ఆర్టిస్ట్ లతో పాటు ఫోటోగ్రాపర్స్ నుంచి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంటిలెక్చువల్ ఫోటోగ్రఫీ ప్రాచుర్యం పొందాక న్యూడ్ మోడల్స్ తో ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మంచి శరీర సౌష్ఠవంతో పాటు గంటల తరబడి ఒకే భంగిమలో ఉండగలిగే ఓపిక ఉన్నవాళ్లు న్యూడ్ మోడల్స్ గా రాణిస్తున్నారు. వీరి జీతం నెలకు రూ.6 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఉంది.
3. క్రోకోడైల్ ట్రైనర్
మనం చెప్పుకుంటున్న ఈ టాప్ 5 చెత్త ఉద్యోగాల్లో అత్యంత ప్రమాదకరమైన జాబ్ క్రోకోడైల్ ట్రైనర్. జాబ్ ఫ్రోఫైల్ చదవగానే మీకు ఇప్పటికే అర్ధమై ఉండాలి. ఈ ఉద్యోగ భాధ్యతలు ఏంటో తెలుసా? ప్రమాదకరమైన మొసళ్లకు శిక్షణ ఇవ్వడం. శిక్షణలో భాగంగా వీరు మొసలి నోట్లో తల పెట్టడం, దాని ముక్కుపై ముద్దు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎంత శిక్షణ ఇచ్చినా ఈ మొసళ్లు ఒక్కోసారి ట్రైనర్లపై దాడి చేస్తాయి. అత్యంత క్రూరంగా ట్రైనర్లను చంపి తినేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా ఈ భయంకరమైన జాబ్ ను చేసేందుకు చాలా మందే ముందుకు వస్తున్నారట. ఎందుకంటే ఇందులో జీతం కాస్త ఎక్కువగానే ముడుతుంది కాబట్టి. క్రోకోడైల్ ట్రైనర్ నెల జీతం రూ.4 లక్షల నుంచి 6 లక్షల వరకూ ఉంటుంది.
4. యానిమల్ మాస్ట్రుబేషన్
కొన్నిసార్లు పరీక్షల కోసం జంతువుల నుంచి వీర్యాన్ని సేకరించాల్సి వస్తుంది. అలా జంతువుల వీర్యాన్ని సేకరించే వాళ్లనే యానిమల్ మాస్ట్రబేటర్స్ అంటారు. ఈ క్రమంలో జంతువుల్లో ఆర్టిఫిషియల్ సెన్సేషన్ ను క్రియేట్ చేసి వీర్యాన్ని కలెక్ట్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్టిఫిషియల్ సెన్సేషన్ వర్కవుట్ కాదు. అప్పుడు వీళ్లు మాన్యువల్ పద్ధతుల్లో వీర్యాన్ని సేకరించాల్సి వస్తుంది. ఇది కొద్దిగా అసహ్యకరంగా ఉన్నా వీళ్లు తమ పనిని చాలా శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగం అందరూ చేయలేనిదే అయినా ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగంలో బాగానే ఉన్నారు. ఇందులో నెల జీతం ఎంతో తెలుసా? రూ. 7 లక్షల నుంచి 8 లక్షలు.
ఇది మన దగ్గర కొత్తగా ఉంటుంది కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా డిమాండ్ ఉన్న ప్రొఫెషన్. ఎవరి ఇంట్లో అయినా మనిషి చనిపోతే ఈ ప్రొఫెనల్స్ వచ్చి ఆ శవాన్ని శుభ్రం చేసి బాడీలో ఉన్న వ్యర్ధాలను ప్రత్యేక పరికరాలతో బయటకు తీసేసి బాడీని శుభ్రం చేసి , శవానికి మేకప్ చేసి శవపేటికలో పెట్టి ఇస్తారు. ఇది వినడానికి కొంచెం భయంగా ఉన్నా విదేశాల్లో డెత్ క్లీనప్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. శవాన్ని మంచి బట్టలతో, సుగంధాలతో ఖననం చేయాలనుకునే వాళ్లు ఎంత డబ్బు వెచ్చించైనా సరే ఈ పని చేయించుకుంటారు. వీరి నెల జీతం దాదాపు రూ.10 లక్షల పైనే ఉంటుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135





Comments
Post a Comment